ఎగువ ప్రాంతంలో ఆల్మట్టి ,నారాయణపూర్ ప్రాజెక్టు నుండి జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది, జూరాల ప్రాజెక్టు ఆరు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.
జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి జూరాలకు భారీగా వరద నీరు చేరుతుంది దీంతో జూరాల జలాశయానికి 40 వేల 076 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుంది. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 318.440 మీటర్లు , జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు జూరాల జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 9.500 టీఎంసీలు జూరాల జలాశయం నుండి 6 గేట్లు తెరిచి 28,641 క్యూసెక్కులు దిగువకు విడుదల. జూరాల జల విద్యుత్ నుండి 3 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, బీమాకు 650 క్యూసెక్కులు విడుదల. కోయిల్ సాగర్ 630 క్యూసెక్కులు, కుడి కాలువ నుండి 252 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుండి700 క్యూసెక్కులు, పార్లల్ కెనాల్ ద్వారా 900 క్యూసెక్కులు నీరుని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ శ్రీశైలం వైపునకు వడివడిగా పరుగులెడుతోంది. ఎగువ నుంచి 50 వేల క్యూసెక్కుల వరకు వరద వస్తుండటంతో మంగళవారం రాత్రి జూరాల ఐదు గేట్లు తెరిచి స్పిల్‌వే ద్వారా దిగువకు 26,759 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రెండు గేట్లను రెండు మీటర్లు, మూడు గేట్లను ఒక్కో మీటరు చొప్పున ఎత్తారు. వరద నేపథ్యంలో ఎగువ, దిగువ జూరాల ప్రాజెక్టులోని మొత్తం ఆరు జలవిద్యుత్తు ఉత్పత్తి యూనిట్లలో 234 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. విద్యుత్తు ఉత్పత్తి అనంతరం 23,501 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. జూరాలకు ఎగువ నుంచి వరద పెరుగుతుండటం వల్ల దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.