తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాలకు జలకళ... అన్నదాతల్లో ఆనందం - JURALA

మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలని తలపిస్తున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టులనుంచి కృష్ణమ్మ జూరాలకు పరవళ్లు తొక్కుతోంది. 23 గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి 2,18,723 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

జూరాలకు జలకళ... అన్నదాతల్లో ఆనదం

By

Published : Aug 4, 2019, 12:03 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో పియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్‌ నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కల నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు స్థిరంగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 318.340 మీటర్లు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకి ఇన్​ఫ్లో 2 లక్షల 22 వేల క్యూసెక్కులు ఉండగా... దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షలా 18,723 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

జూరాలకు జలకళ... అన్నదాతల్లో ఆనదం

ABOUT THE AUTHOR

...view details