తెలంగాణ

telangana

ETV Bharat / state

NTR-RRR: వినూత్న రీతిలో అభిమానం.. ధాన్యం, పూలతో హీరో చిత్రపటం - గద్వాలలో చిత్రపటం

NTR-RRR: జూనియర్ ఎన్టీఆర్​పై వినూత్న రీతిలో అభిమానం చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఈనెలలో విడుదలవుతున్న సందర్భంగా ధాన్యం, పువ్వులతో ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలో ఈ వేడుక నిర్వహించారు.

NTR-RRR
జూనియర్ ఎన్టీఆర్

By

Published : Mar 17, 2022, 5:12 PM IST

NTR-RRR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన చిత్రపటాన్ని వినూత్నంగా రూపొందించారు. దాదాపు 120 కిలోల పూలు, 50 కిలోల ధాన్యం గింజలతో తయారు చేశారు. ఈనెల 25న సినిమా విడుదల కానున్న సందర్భంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్​లో ఎన్టీఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు.

ఎన్టీఆర్ చిత్రపటాన్ని వీక్షించేందుకు అభిమానులు పెద్దఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ టీజర్​ను గద్వాల ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిరు ముదిరాజ్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కరోనా సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు.

ధాన్యం, పూలతో హీరో చిత్రపటం

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details