ప్రముఖ శక్తిపీఠంగా వెలుగొందుతూ.. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు కరోనా ప్రభావం వల్ల వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అధికారులు మూసివేశారు. ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు భక్తులను అనుమతించవద్దని సర్కాలు ఆదేశాలను పాటిస్తూ అధికారులు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
కరోనా ఎఫెక్ట్: అలంపూర్ జోగులాంబ ఆలయం మూసివేత - శక్తిపీఠం
జోగులాంబ గద్వాల జిల్లాలోని సుప్రసిద్ధ ఆలయమైన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 31 వరకు మూసేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులందరూ సహకరించగలరని ఆలయ అర్చకులు కోరారు.
కరోనా ఎఫెక్ట్: అలంపూర్ జోగులాంబ ఆలయం మూసివేత
ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలియజేశారు. ప్రజలందరి ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈనెల 31 వరకు ఎవరూ ఆలయదర్శనానికి రావద్దని అర్చకులు తెలియజేశారు.
ఇవీ చదవండి:కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు