తెలంగాణ

telangana

ETV Bharat / state

jogulamba brahmotsavalu: జోగులాంబలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం - జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

jogulamba brahmotsavalu: జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇవాళ్టి నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

jogulamba amma brahmotsavalu, jogulamba varshika brahmotsavalu
జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

By

Published : Feb 2, 2022, 1:25 PM IST

jogulamba brahmotsavalu: పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠంగా పిలిచే జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8:30 గంటల నుంచి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్​ వరుణం, మహా కలశ స్థాపనతో బ్రహ్మెత్సవాలకు అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి.

ఈ నెల 6న వసంత పంచమి సందర్భంగా జోగులాంబ అమ్మవారు నిజరూప దర్శనమిస్తారు. దర్శనాన్ని చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. వార్షిక ఉత్సవాలని అలంపూర్ పట్టణంలో జోగులాంబ జాతరగా భక్తులు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. వసంత పంచమి రోజు పంచామృత కలశాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు.

ఇది చదవండి: ''వచ్చింది.. ఒమిక్రానా? డెల్టానా? చెప్పేదెవరు..? చికిత్స ఎలా..?'

ABOUT THE AUTHOR

...view details