తెలంగాణలోనే వెలసిన ఏకైక శక్తిపీఠం. దేశంలోనే అయిదో శక్తి పీఠం అయిన జోగులాంబ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 17నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన గోడ పత్రికను మ్మెల్యే అబ్రహం ముఖ్య అతిథిగా హాజరై.. విడుదల చేశారు. ముందుగా ఈవో ప్రేమ్‌కుమార్, అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.
ఈనెల 17 నుంచి జోగులాంబ శరన్నవరాత్రి ఉత్సవాలు
ఈనెల 17 నుంచి జోగులాంబ గద్వాల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు తొమ్మిదిరోజుల పాటు నిర్వహించునున్నారు. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు.
ఈనెల 17 నుంచి జోగులాంబ శరన్నవరాత్రి ఉత్సవాలు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఈవోను అదేశించారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు.
ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా ఈనెల 17 నుంచి తొమ్మిది రోజుల పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని చెప్పారు. ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
- ఇదీ చూడండి:తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం.. అలంపూర్