ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కారు జోరు కొనసాగింది. జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలుండగా... అన్నింటిని తెరాస సొంతం చేసుకుని జడ్పీ ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీటీసీ స్థానాల్లోనూ... గులాబీ పార్టీ హవా కొనసాగించింది. మొత్తం 141 ఎంపీటీసీ స్థానాలకు గానూ... 99 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 19, భాజపా 10 స్థానాలు గెలుచుకుంది. ఇతరులు 13 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోగా.... తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. కార్యకర్తల ర్యాలీలతో రహదారులన్నీ... గులాబీ మయంగా మారిపోయాయి.
తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం | |
జడ్పీటీసీ స్థానాలు | 12 | 0 | 0 | 0 | 12 |
ఎంపీటీసీ స్థానాలు | 99 | 19 | 10 | 13 | 141 |