రైతులకు అందుబాటులో ఉంటూ వారు తీసుకొచ్చిన ఉత్పత్తులను విక్రయించడంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని మార్కెట్ నూతన అధికార బృందానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల వ్యవసాయ మార్కెట్ నూతన ఛైర్‌పర్సన్‌గా రామేశ్వర్ అమ్మ, వైస్ ఛైర్మన్‌గా వాకిట్ల సంజీవులు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
గద్వాల మార్కెట్ ఛైర్పర్సన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం - తెలంగాణ వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ నూతన ఛైర్పర్సన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుష్పమ్మ ఆధ్వర్యంలో నూతన మార్కెట్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు.
గద్వాల మార్కెట్ నూతన ఛైర్పర్సన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
మార్కెట్ ఛైర్‌పర్సన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని రామేశ్వర్ అమ్మ అన్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.