Jogulamba Gadwal Road Damage : అడుగుకో గుంత.. రోజుకో ప్రమాదం.. ఆ మార్గంలో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. Jogulamba Gadwal Road Damage :జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కూడలి నుంచి రాయచూరుకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అది. కర్నూల్ నుంచి రాయచూరు వెళ్లాలనుకునే వారికి ఇది దగ్గరి దారి. దీంతో రవాణా వాహనాలు,బస్సులు, ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలు(Two wheelers) వేల సంఖ్యలో నిత్యం ఈ రహదారి గుండా ప్రయాణిస్తుంటాయి. మిగిలిన చోట్ల రహదారి ఎలా ఉన్నా.. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి నుంచి ఎరిగెర వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రహదారి అధ్వాన్నంగా మారింది. ఆ రహదారిపై ప్రయాణిస్తే అడుగడుగునా గుంతలే. వానాకాలంలోగుంతల్లో నీరు చేరితే ఏ గుంత ఎక్కడుందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ప్రయాణికులకు నరకం.. ప్రయాణం ఆలస్యం :రోడ్డు బాగుంటే 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా.. 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ ఈ దారిపై దాటేలోపు ప్రయాణికులు(Travel Difficulties For Motorists) నరకం చూస్తున్నారు. 30 నుంచి 45 నిమిషాల మేర సమయం పడుతోంది. దీంతో ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి(Journeys are Delayed). నిత్యం ఈ రోడ్డుపై నుంచి వెళ్లే ఆటోలు, ద్విచక్రవాహనాలు పాడై మరమ్మతులకు గురవుతున్నాయి. మారుమూల ప్రాంతం కావడంతో మరమ్మతులు(Repairs) చేసే దిక్కు కూడా ఉండదు. నాలుగైదు చోట్ల జనం ప్రమాదాల(People Affected by Accidents) బారిన పడుతున్నారు. గర్భిణీలు ఈ దారిలో వెళ్లాలంటే అదో సాహసమే.
Hydernagar Road Damage : హైదర్‌నగర్‌లో కుంగిన రహదారి.. భయాందోళనలో స్థానికులు
రెండు వరసల రహదారిగా విస్తరించినా.. పనులు మాత్రం కాలేదు: అలంపూర్ కూడలి నుంచి రాయచూరు వరకు ఈరహదారిని నిర్మించి 20 ఏళ్లుపైనే గడుస్తోంది. అప్పట్లో సింగల్ రోడ్డుగా ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ మార్గాన్ని రెండు వరుసల రహదారిగా విస్తరించినా.. 10 కిలోమీటర్లలో మాత్రం ఆ పనులు కాలేదు. అధికారులు ఐజా చౌరస్తా నుంచి రాయచూరు సరిహద్దు వరకు 10.7 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను రూ.8 కోట్లతో చేపట్టారు.
2018లో కాంట్రాక్టర్కు పనులు అప్పగించగా.. ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఆ గుత్తేదారును తొలగించి.. కొత్తగా 2022 జూన్లో మరో గుత్తేదారుకు పనులు అప్పగించారు. 6 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం 4 కిలోమీటర్ల మేర గ్రావెల్ పనులు జరుగుతున్నాయి. మిగిలిన పనులన్నీ పూర్తై రెండు వరుసల రహదారిగా విస్తరిస్తే తప్ప.. ఆ మార్గంలో ప్రయాణ కష్టాలు తీరవు. వీలైనంత త్వరగా పనులు చేయాలని గట్టు మండల ప్రజలు కోరుతున్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. రోడ్డు విస్తరణకు(Road Widening Works) చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.
Hyderabad Roads Damage 2023 : వర్షాలకు చిత్తడైన హైదరాబాద్ రోడ్లు.. నగరంలో 4 వేల గుంతలు.. ముంపులోనే కాలనీలు
Hanamkonda Bus Stand : ఏంటీ..? ఇది బస్టాండా.. చెరువు అనుకున్నానే..?