ఆటో డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో 'మై ఆటో ఈజ్ సేఫ్' అనే యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పాల్గొన్నారు.
ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి: ఎస్పీ రంజన్ రతన్ కుమార్ - జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల అవగాహన
ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ సూచించారు. జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో 'మై ఆటో ఈజ్ సేఫ్' అనే యాప్‌పై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
![ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి: ఎస్పీ రంజన్ రతన్ కుమార్ Jogulamba gadwal district SP Ranjan ratan kumar training to auto drivers on My Auto is Safe Mobile App today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11088733-562-11088733-1616244429831.jpg)
ఆటో డ్రైవర్లు విధి నిర్వహణలో సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. ప్యాసింజర్లతో మర్యాదగా వ్యవహరిస్తూ గమ్యానికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురి చేసిన ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. గద్వాలలో మొత్తం 400 అటోలు ఉన్నాయని.. అందులో 240 మంది ఆటో డైవర్లకు యాప్‌ను వినియోగిస్తున్నారని అన్నారు. మిగిలిన వారంతా వారం రోజుల్లో ఈ యాప్ ఉపయోగించపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ జక్కుల హనుమంతు, ఎస్సైలు హరి ప్రసాద్ రెడ్డి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.