ఐకేపీ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జోగులాంబ జిల్లా కలెక్టర్ శృతి ఓఝూ
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ శృతి ఓఝా అధికారులను ఆదేశించారు. అన్నదాతలు తెచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని తుర్కోనిపల్లి, అత్తిపురం, బీరెల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శృతి ఓఝా ఆకస్మికంగా తనిఖీ చేశాారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తుర్కోనిపల్లి కొనుగోలు కేంద్రములో ఇప్పటివరకు 5,677 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు ఐకేపీ ఇంఛార్జి తెలిపారు. పాత గన్నీ బ్యాగులతో పాటు టార్పాలిన్లు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌కు సమాధానమిచ్చారు.
TAGGED:
కలెక్టర్ శృతి ఓఝూ