జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా.. ప్రతిరోజు.. 10వేల పనిదినాలు కల్పించాలని అధికారులను అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
'జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలు పెంచాలి' - jogulamba gadwal district additional collector sriharsha
జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిదినాలు పెంచాలని మండల అభివృద్ధి అధికారులను జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
చేసిన పనికి కూలీలకు వెంటనే డబ్బు అందేలా ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 26వరకు వందశాతం పల్లె ప్రకృతి వనాలకు స్థలసేకరణ పూర్తి కావాలని ఆదేశించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికి మరుగుదొడ్లు మంజూరైనా.. ఇప్పటి వరకు నిర్మించనివి 3500 ఉన్నాయని, అక్టోబర్ 2లోగా మిగతావి అన్ని పూర్తవ్వాలన్నారు.
నిధులున్నా మరుగుదొడ్ల నిర్మాణం ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం పెండింగ్లో ఉన్నాయని, వాటన్నింటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.