జోగులాంబ గద్వాల జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేయాలని కలెక్టర్ శృతి ఓజా అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై జిల్లాలోని అధికారులతో ఆమె దూర దృశ్య సమీక్షను నిర్వహించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారితో ప్రతిరోజు తహసీల్దార్, మెడికల్, పోలీస్ అధికారులు సంప్రదింపులు జరపాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి పై నివేదిక తీసుకోవాలని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించాలని, శానిటేషన్ పనులను కొనసాగించాలని కోరారు.
హోం క్వారంటైన్‌లోని వారు బయట తిరగొద్దు : శృతి ఓజా - జోగులాంబ గద్వాల కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల హోమ్ క్వారంటైన్లో ఉన్నవారు బయటకు రావద్దని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతి ఓజా కోరారు. 14 రోజుల గడువు ముగిసినప్పటికీ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కొవిడ్-19 నివారణ చర్యలపై అధికారులతో ఆమె దూర దృశ్య సమీక్షను నిర్వహించారు.
కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్