జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ శృతి ఓజా విస్తృత పర్యటన చేశారు. నియోజకవర్గంలోని ఇటిక్యాల, కొండేరు మానవపాడు, పోద్దపోతులపాడు, ఉండవెల్లి మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న స్మశానవాటికలను పరిశీలించారు. తడిచెత్త, పొడిచెత్తను విభజించడానికి డంపింగ్ యార్డు నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నర్సరీ పనులను పర్యవేక్షించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలంపూర్లో కలెక్టర్ పర్యటన - గద్వాల వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ శృతి ఓజా గ్రామాల్లోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి పలు విషయాలు తెలియజేశారు.
అలంపూర్లో కలెక్టర్ పర్యటన