తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైన్మెంట్ జోన్​లలో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ - కంటైన్మెంట్ జోనలలో పర్యటించిన కలెక్టర్ శృతి ఓఝా

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని కంటైన్మెంట్ జోన్​లలో కలెక్టర్ శృతి ఓఝా, ఎస్పీ అపూర్వ రావు పర్యటించారు. లాక్​డౌన్ పూర్తయ్యేవరకు ఏ ఒక్కరూ బయటకు రావొద్దని సూచించారు.

GADWAL COLLECTOR AND SPVISITED CONTAINMENT AREAS
కంటైన్మెంట్ జోనలలో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ

By

Published : Apr 28, 2020, 7:44 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని కంటైన్మెంట్ జోన్​లో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా భరోసా కల్పించారు. మంగళవారం ఇదయం జిల్లా ఎస్పీ అపూర్వరావు, అధికారులతో కలిసి కంటైన్మెంట్ జోన్​లలో పర్యటించారు. అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న నిత్యావసర సరుకుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఒకవేళ ఎమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే 104, 100, 08456-274007కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. ప్రతిరోజూ ఉదయాన్నే గృహ నియంత్రణలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించాలని మెడికల్ ఆఫీసర్ స్రవంతిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ క్రిష్ణ, ఆర్డీఓ రాములు, డీఎస్పీ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ నర్సింహా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. శశికళ, మెడికల్ ఆఫిసర్ స్రవంతి ఉన్నారు.

ఇదీ చూడండి:భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details