గద్వాల జిల్లా అలంపూర్‌లోని ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఈనెల 13 నుంచి 19 వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. అలంపూర్‌లో ఈనెల 13 నుంచి దర్గా ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. వారంరోజుల పాటు జరిగే ఆ ఉత్సవాలకు జనం అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉండడం వల్ల ముందు జాగ్రత్తగా ఆలయాలను మూసివేస్తున్నట్లు ఈవో చెప్పారు.
ఉర్సు ఎఫెక్ట్: ఆ రోజుల్లో అలంపూర్‌లోని శక్తిపీఠం మూసివేత - ఈనెల 13 నుంచి 19 వరకు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు మూసివేత
గద్వాల జిల్లా అలంపూర్‌లో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈనెల 13 నుంచి 19 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
![ఉర్సు ఎఫెక్ట్: ఆ రోజుల్లో అలంపూర్‌లోని శక్తిపీఠం మూసివేత Jogulamba Bala Brahmeswara Swamy Temple july 13th to 19th july close](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7956995-928-7956995-1594289793614.jpg)
జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు మూసివేత!
ఉర్సు ఉత్సవాల సమయంలో అర్చకులు నిత్య పూజలు నిర్వహించి ఆలయాలు మూసివేస్తారు. భక్తులకు అనుమతి లేదని, అందరూ సహకరించి 13 నుంచి 19 వరకు దర్శనాలు విరమించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి :పరిస్థితి బాలేదు.. కరోనా పరీక్షలు పెంచండి: అసదుద్దీన్