జోగులాంబ ఆలయంలో ఇంటిలిజెన్స్ ఐజీ - IG
అష్టాదశ శక్తీపీఠమైన జోగులాంబ ఆలయాన్ని ఇంటిలిజెన్స్ ఐజీ అరుణ్‌కుమార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

జోగులాంబ ఆలయంలో ఇంటిలిజెన్స్ ఐజీ
దక్షిణ కాశీ ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని ఇంటిలిజెన్స్ ఐజీ అరుణ్ కుమార్ సందర్శించారు. ఇవాళ కుటుంబసమేతంగా వెళ్లి దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
జోగులాంబ ఆలయంలో ఇంటిలిజెన్స్ ఐజీ