మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 4,04,230 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నిరంతరం వరద ఉద్ధృతిని అంచనా వేస్తున్న అధికారులు.. 44 గేట్లను ఎత్తి 4,05,065 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడిచిపెడుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.142 టీఎంసీల నీరు ఉంది.
Jurala: జూరాలకు భారీగా వరద .. 44 గేట్లు ఎత్తి నీటి విడుదల - తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ
ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. నదీ తీర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
jurala project
జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 316.630 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల పథకాలకు పంపింగ్ కొనసాగుతోంది. నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు.
ఇదీచూడండి:JURALA: పెద్ద ఎత్తున వరద... 32 గేట్లు ఎత్తి నీటి విడుదల