భార్యపై భర్త దాడిచేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మనోపాడు మండలం నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. నారాయణపురానికి చెందిన జగన్ మోహన్, లీలావతి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి లోనైనా జగన్ మోహన్..భార్య లీలావతి పై గొడ్డలితో దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న లీలావతిని బంధువులు హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
'భార్యపై గొడ్డలితో దాడి..పరిస్థితి విషమం' - JOGULAMBA GADWAL DISTRICT
దాంపత్య జీవితంలో కలతలు రేగి భార్యపై ఓ భర్త హత్యాయత్నం చేసిన ఘటన గద్వాల జోగులాంబ జిల్లాలో చోటు చేసుకుంది.
హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన బంధువులు
ఇవీ చూడండి : ఫెయిల్ అవడంలో మనం నంబర్‌వన్: షబ్బీర్ అలీ