తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ హుండీల లెక్కింపును అధికారులు నిర్వహించారు. అమ్మవారి హుండీ ఆదాయం మొత్తం 43 లక్షల 56 వేల 728 రూపాయలు కాగా... 2 యూఎస్ డాలర్లు, 5 యూరోలతో పాటు 62 మిల్లీ గ్రాములు మిశ్రమ బంగారం, 620 గ్రాముల మిశ్రమ వెండి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జోగులాంబ హుండీ ఆదాయం రూ. 55 లక్షలు - Jogulamba Temple Latest News
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 55 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపులు నిర్వహించారు.
![జోగులాంబ హుండీ ఆదాయం రూ. 55 లక్షలు HUNDI INCOME CALCULATION AT JOGULAMBA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7645613-500-7645613-1592326235534.jpg)
HUNDI INCOME CALCULATION AT JOGULAMBA
స్వామి వారి హుండీ ఆదాయం 11 లక్షల 46 వేల ఐదు వందల తొంభై రూపాయలు కాగా... 110 గ్రాముల మిశ్రమ వెండి, ఒక యూఎస్ డాలర్ వచ్చిందని చెప్పారు. అన్నదాన సత్రం హుండీకి రూ. 65, 463 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తంగా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపుల్లో రూ. 55,68,787 ఆదాయం లభించిందని ఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపులు నిర్వహించారు.
ఇవీ చూడండి:తక్కువ ధరకే మాస్కులు... నకిలీ పత్రాలతో పక్కా ప్లాన్