జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి లక్షా 53 వేల 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా... ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తి లక్షా 61 వేల 081 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా... ప్రస్తుతం 1043 అడుగులుగా ఉంది. జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.670 టీఎంసీల నీటిని నిల్ప ఉంచారు.
జూరాలకు కొనసాగుతున్న వరద... 19 గేట్లు ఎత్తివేత - huge inflow to jurala project, 19 gates lifted
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత వారం రోజుల నుంచి జూరాలకు స్థిరంగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 19 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాలకు కొనసాగుతున్న వరద... 19 గేట్లు ఎత్తివేత