తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాలకు భారీగా వరద ప్రవాహం - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు

మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో పాటు జూరాల పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 50 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

జూరాలకు భారీగా వరద ప్రవాహం
జూరాలకు భారీగా వరద ప్రవాహం

By

Published : Oct 15, 2020, 11:48 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి 5 లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా... ప్రాజెక్టు నిండుకుండలా మారింది.

జలాశయం పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1,042 అడుగులు ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 8.087 టీఎంసీలు ఉంది. జలాశయం 50 గేట్లు తెరిచి 5 లక్ష 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ఇదీ చూడండి:నిండుకుండలా ఫాక్స్​సాగర్... అలుగు పోస్తే దిగువ ప్రాంతాలకు ముప్పు

ABOUT THE AUTHOR

...view details