తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఏడు ఆస్పత్రులది నేరపూరిత నిర్లక్ష్యం: హైకోర్టు - తెలంగాణ తాజా వార్తలు

గద్వాలకు చెందిన గర్భిణికి చికిత్స అందించడానికి నిరాకరించిన ఆస్పత్రుల విషయంపై న్యాయవాదులు రాసిన లేఖలపై హైకోర్టు ఇవాళ మరోసారి విచారించింది. వైద్యం చేయడానికి నిరాకరించిన ఆ ఏడు ఆస్పత్రులది నేరపూరిత నిర్లక్ష్యమని, వాటి నుంచి పరిహారాన్ని వసూలు చేసి బాధితురాలి కుటుంబానికి అందజేయాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది.

high court hearing on pregnant women death issue due to medical negligence
ఆ ఏడు ఆస్పత్రులది నేరపూరిత నిర్లక్ష్యం: హైకోర్టు

By

Published : May 19, 2020, 10:40 PM IST

గర్భిణికి చికిత్స చేయడానికి నిరాకరించిన ఆస్పత్రులది నేరపూరిత నిర్లక్ష్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. గద్వాలకు చెందిన ఓ గర్భిణికి వైద్యం చేయడానికి నిరాకరించిన ఏడు ఆస్పత్రుల విషయంపై న్యాయవాదులు కె.కిశోర్​కుమార్​, శ్రీనితపూజారి రాసిన లేఖలపై న్యాయస్థానం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రుల నుంచి పరిహారం వసూలు చేసి బాధితురాలి కుటుంబానికి అందజేయాల్సి ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

గర్భిణిలను కరోనాయేతర ఆస్పత్రులకు తరలించి తగిన చికిత్స అందజేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. అంబులెన్సులు, నోడల్‌ అధికారుల ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచారా లేదా అనే వివరాలతో నివేదికను సమర్పించాలంటూ విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:స్టాంపులు అంటించేందుకు అది వాడొద్దు!

ABOUT THE AUTHOR

...view details