కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువనున్న ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరడం వల్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆలమట్టికి 2 లక్ష 41 వేల 714 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 2 లక్షల 51 వేల 922 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 1705 అడుగులుండగా.. ప్రస్తుత నీటిమట్టం 1699 అడుగులు ఉంది. జలాశయంలో ప్రస్తుతం 101.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎగువ ప్రాజెక్టులు గలగల... జూరాలకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద ఉద్ధృతంగా సాగుతోంది. ఎగువనున్న ఈ ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న నీటితో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కళకళలాడుతోంది.
నారాయణపూర్ ప్రాజెక్టులోకి 2 లక్షల 76 వేల 823 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 2 లక్షల 83 వేల 921 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1615 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1607 అడుగులు ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 27.52 టీఎంసీల నీటితో కళకళళాడుతోంది.
జూరాలకు జలకళ
ఎగువ ప్రాజెక్టుల నుంచి జూరాలకు 3 లక్షల 24 వేల727 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి నీటిమట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1043 అడుగుల మేర నీరు నిల్వ ఉందిపూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం జూరాల జలాశయం 8.770 టీఎంసీల నీటితో కళకళలాడుతోంది. ఎగువన ప్రవాహం దృష్టిలో ఉంచుకొని 39 గేట్లు తెరిచి 3 లక్ష 20 వేల 838 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటితో నిండుకుండలా కనిపిస్తూ కనువిందు చేస్తున్న జలాశయాన్ని చూడటానికి చుట్టుపక్కల జనం బారులు తీరుతున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.