కొవిడ్ ఉద్ధృతి తగ్గుతుండడంతో ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ సడలింపు ఇచ్చినప్పటికీ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కచ్చితంగా ఈ-పాస్ కలిగి ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు.
సరిహద్దు వద్ద నెలకొన్న రద్దీ... ఈ-పాస్ ఉంటేనే అనుమతి - telangana news
రాష్ట్ర సరిహద్దులోని టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో వస్తున్న వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాటికి మాత్రమే అనుమతిస్తూ....లేని వాహనాలను తిప్పి పంపుతున్నారు.
![సరిహద్దు వద్ద నెలకొన్న రద్దీ... ఈ-పాస్ ఉంటేనే అనుమతి సరిహద్దు వద్ద నెలకొన్న రద్దీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12104836-777-12104836-1623476348394.jpg)
సరిహద్దు వద్ద నెలకొన్న రద్దీ
జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేసి ఈ పాస్ ఉన్న వాటిని మాత్రమే అనుమతిఇస్తున్నారు. ఈ-పాస్ లేని వాహనాలను తిప్పి పంపుతున్నారు. వీక్ఎండ్ కావడంతో అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది.
ఇదీ చదవండి:పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ధరలు