జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో వైన్ షాపుల దగ్గర మందుబాబులు బారులు తీరారు. అలంపూర్ చౌరస్తా... ఏపీ - తెలంగాణ సరిహద్దులో ఉన్నందున కర్నూలు నుంచి అధిక సంఖ్యలో మందుబాబులు వస్తున్నారు. ఏపీలో మద్యం రేటు అధికంగా ఉండటం.. సరైన బ్రాండ్లు దొరకడం లేదని అందరూ ఇటువైపు వస్తున్నారు.
అలంపూర్లో జోరుగా మద్యం వ్యాపారం.. క్యూ కట్టిన ఏపీ మందుబాబులు - అలంపూర్ మద్యం వ్యాపారం వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో వైన్ షాపుల వద్ద రద్దీ జాతరను తలపిస్తోంది. దుకాణాల ముందు దగ్గర మందుబాబులు బారులు తీరారు. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో అందరూ ఇటువైపు వస్తున్నారు. మందుబాబుల పుణ్యమా చౌరస్తాలోని మిగతా దుకాణాల్లోనూ వ్యాపారం జోరుగా సాగుతోంది.
alampur
మందుబాబుల వల్ల అలంపూర్ చౌరస్తాలోని మిగతా వ్యాపారులు కూడా బాగా నడుస్తున్నాయి. వాటర్ బాటిల్స్, చికెన్ బాగా అమ్ముడుపోతున్నాయి. దుకాణాల్లోనే కాకుండా మద్యం షాపు పరిసరాల్లో ప్రత్యేకంగా ఆటోల్లో నీళ్ల సీసాలు తెచ్చి అమ్ముతున్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు