తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాలకు భారీగా వరద

ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 3 లక్షల 5 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.

భారీగా వరద

By

Published : Aug 7, 2019, 10:13 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు చేరడం వల్ల జూరాల నిండుకుండను తలపిస్తోంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.330 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా... ప్రస్తుతం 317.330 మీటర్లకు చేరింది. ప్రాజెక్టులోకి 3 లక్షల 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. దిగువన ఉన్న శ్రీశైలానికి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల కుడి కాల్వ ద్వారా 750 క్యూసెక్కులు.. ఎడమ కాల్వ ద్వారా 781 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు.

భారీగా వరద

ABOUT THE AUTHOR

...view details