జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. 86,230 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. ఫలితంగా అధికారులు 8 గేట్లు తెరిచి.. 83,779 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద.. జూరాలకు జలకళ - జూరాల ప్రాజెక్టు తాజా వార్తలు
జూరాల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద.. జూరాలకు జలకళ
జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 318.100 మీటర్లుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.810 టీఎంసీలుగా ఉంది.