కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువన ఉన్న ప్రాజెక్టులోకి వదులుతున్నారు.
ఆల్మట్టి జలాశయానికి భారీగా వరద
ఆల్మట్టి జలాశయానికి లక్షా 66 వేల 935 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2 లక్షల 51 వేల 922 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు . ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం1705 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1700 అడుగులుగా ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 106.52టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు.
నిండుకుండలా నారాయణపూర్..
నారాయణపూర్ ప్రాజెక్టుకు 2 లక్షల 44 వేల 408 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా... 2 లక్షల72 వేల 217 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం1615 అడుగులు కాగా...ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1607 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 27.87 టీఎంసీలుగా ఉంది.
వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు..
ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయిన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో వరదను నిల్వ చేసే అవకాశం లేక వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాల జలాశయానికి 3 లక్షల 45 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్జం 1043 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి 8.473 టీఎంసీల నీటిని నిల్ప ఉంచారు. జూరాల జలాశయం నుంచి 39 గేట్లు తెరిచి 3 లక్షల 34 వేల 330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు