భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి పై నుంచి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 46 గేట్లు ఎత్తి 4,81,332 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 4,68,400 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,040 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామార్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 4.3 టీఎంసీలుగా ఉంది.
జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద - etv bharat
జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 46 గేట్లు ఎత్తి 4,81,332 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద