జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కేశవరం గ్రామానికి చెందిన మల్లేష్ స్నేహితుని చేతిలో హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం వీరన్న అనే వ్యక్తితో కలిసి బయటికి వెళ్లి రెండు రోజులు గడిచినా తిరిగి రాలేదు. వీరన్నను నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పాడు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... హత్య చేసి, కాల్చి గుంతలో పూడ్చినట్లు ఒప్పుకున్నాడు. హత్యలో మరో వ్యక్తి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మృతునికి గర్భంతో ఉన్న భార్య, కుమారుడు ఉన్నారు.
స్నేహితుడిని చంపి.. కాల్చి పూడ్చేశాడు - ija
జోగులాంబ గద్వాల జిల్లాలో స్నేహితునితో కలిసి మూడ్రోజుల క్రితం బయటకు వెళ్లిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో తెలుసా..?
స్నేహితుడిని చంపి..కాల్చి..పూడ్చేశాడు