తెలంగాణ

telangana

ETV Bharat / state

జోగులాంబ గద్వాల జిల్లాలో గడపగడప ప్రచారం! - తెలంగాణ వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గడపగడప ఎన్నికల ప్రచారం చేశారు. జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ సరిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆమె గుర్తు చేశారు.

graduates-mlc-election-campaign-at-new-housing-board-colony-in-jogulamba-gadwal-district-by-zp-chairperson-saritha
జోగులాంబ గద్వాల జిల్లాలో గడపగడప ప్రచారం!

By

Published : Feb 28, 2021, 3:50 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అగ్రభాగాన నిలుస్తోందని జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ సరిత అన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం ఉదయం గడపగడపకు వెళ్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పట్టభద్రులు తెరాస అభ్యర్థి సురభి వాణీ దేవిని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 1,32,000 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని... పీవీ కూతురుని గెలిపించుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ కవిత సేవాగుణం... నిరుపేద మహిళ కుటుంబానికి భరోసా!

ABOUT THE AUTHOR

...view details