జోగులాంబ ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ వచ్చిన చిన్నారెడ్డి... సంపత్ కుమార్, మల్లు రవితో కలిసి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సందర్శించుకున్నారు.
జోగులాంబను దర్శించుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి - Jogulamba Gadwal District latest News
కాంగ్రెస్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీగా గెలిస్తే ఆలయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు.
![జోగులాంబను దర్శించుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి Graduate MLC candidate Chinnareddy Jogulamba temple visited](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10811892-1071-10811892-1614504941302.jpg)
జోగులాంబను దర్శించుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి
ఆలయ అర్చకులు వీరికి స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులను అడిగి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్సీగా గెలిస్తే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బ్యాలెట్ బాక్సులు!