కరోనా కష్టకాలంలోనూ రోగులకు సేవలు చేస్తుంటే మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని... గద్వాల జిల్లా ఆస్పత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. ఒప్పంద కార్మికులను ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
'ఒప్పంద కార్మికులను ఎవరూ పట్టించుకోవడం లేదు' - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు
మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ... జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కరోనా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రోగులకు సేవలందిస్తున్నామని అన్నారు.
జీతాలు చెల్లించాలని ఒప్పంద కార్మికుల ధర్నా, జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు
కుటుంబ సభ్యులకు దూరమై ఆస్పత్రిలో సేవలందిస్తున్నామని కార్మికులు పేర్కొన్నారు. పెంచిన జీతాలు కూడా అమలు చేయడం లేదని... వెంటనే తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పాస్పోర్ట్ కార్యాలయ పనివేళల్లో మార్పులు
TAGGED:
telangana latest news