తెలంగాణ

telangana

ETV Bharat / state

'గతేడాది కంటే ఈసారి ఎక్కువ విద్యుత్​ను ఉత్తత్తి చేసుకోవచ్చు'

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రాన్ని జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు సందర్శించారు. ఈ ఏడాది ఆశించిన మేర వరద వృద్ధి ఉండటం వల్ల జూరాల, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో గతం కంటే ఎక్కువ విద్యుత్​ను ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది 13 వేల మెగావాట్లు పైగానే ఉత్పత్తి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

genco and transco cmd prabhaker rao visited jurala  Hydro electric power station
'గతేడాది కంటే ఈసారి ఎక్కువ విద్యుత్​ను ఉత్తత్తి చేసుకోవచ్చు'

By

Published : Jul 24, 2020, 10:53 PM IST

ఈ ఏడాది ఆశించిన మేర వరద వృద్ధి ఉండటం వల్ల జూరాల, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో గతం కంటే ఎక్కువ విద్యుత్​ను ఉత్పత్తి చేసుకోవచ్చని జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రాన్ని ప్రభాకర్​రావు సందర్శించారు. జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఉన్న 6 యూనిట్లకు గాను ఐదు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందన్నారు.

5వ యూనిట్ గత కొన్ని రోజుల నుంచి సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. ఇందుకు సంబంధించి యూనిట్ యొక్క స్థితిగతులను ఇంజినీర్లు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జల విద్యుత్ కేంద్రంలో ఉన్న అర్బన్​లను పరిశీలించారు. గతేడాది 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నామని... ఈ ఏడాది 13 వేల మెగావాట్లు పైగానే ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది ముందుగానే వరదలు రావటం వల్ల ఎగువ జూరాలలో ఐదు యూనిట్లు దిగువ జూరాలలో 6 యూనిట్ల చొప్పున... అలాగే శ్రీశైలంలోనూ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని ప్రభాకర్​రావు తెలిపారు.

ఇదీ చదవండి:ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం

ABOUT THE AUTHOR

...view details