జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఉత్తరవాహిని తుంగభద్ర తీరంలో వెలిసిన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు వినాయక చవితి పూజలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయంలో ఉన్న వినాయకునికి పూజలు నిర్వహించారు. కరోనా కారణంగా భక్తులు లేకుండా నిరాడంబరంగా పూజలు నిర్వహించారు.
అలంపూర్లో నిరాడంబరంగా వినాయక చవితి పూజలు - వినాయక చవితి
కరోనా కారణంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు వినాయక చవితి పూజలను నిరాడంబరంగా నిర్వహించారు. శివాలయంలో ఉన్న గణపతికి 21 రకాల పత్రాలు సమర్పించారు.
అలంపూర్లో నిరాడంబరంగా వినాయక చవితి పూజలు
ముందుగా స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు.పూలతో అలంకరించారు. ప్రత్యేకంగా తయారు చేసిన గరిక మాలను వేశారు. 21 రకాల పత్రాలను సమర్పించారు. అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య సకల విజ్ఞాలను తొలగించే గణనాథునికి హారతులిచ్చారు.
ఇవీ చూడండి: భక్తుల కొంగు బంగారం కాణిపాకంలో ఉత్సవాలు ప్రారంభం