తెలంగాణ

telangana

ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్​

గద్వాల జిల్లా అలంపూర్​లో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను కలెక్టర్​ శృతి ఓఝా పరిశీలించారు. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా ఘాట్​లు ఉండేలా చూడాలన్నారు. పుష్కరాలకు ఎక్కువ సమయం లేనందున త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

By

Published : Nov 16, 2020, 7:03 PM IST

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్​
తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్​

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాల పనులను జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శృతి ఓఝా పర్యవేక్షించారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్ ఒకటి వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి.

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్​ పర్యవేక్షించారు. భక్తుల క్యూ లైన్లు, వీఐపీ క్యూలైన్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు దర్శనం చేసుకునే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా ఘాట్ ఉండేలా చూడాలన్నారు.

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్​ శృతి ఓఝా

వచ్చే భక్తులకు మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని శృతి ఓఝా ఆదేశించారు. అదే విధంగా స్నాన వాటికలు, దుస్తులు మార్చుకోవడానికి వసతులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలకు ఎక్కువ సమయం లేనందున త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులు నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. అనంతరం పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.

ఇదీ చదవండి:ఈనెల 20 నుంచి తుంగభద్ర నది పుష్కరాలు

ABOUT THE AUTHOR

...view details