జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇండోర్ స్టేడియంలో గద్వాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బ్యాటింగ్ చేసి... పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 8 క్రికెట్ టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి బహుమతి 50,000.. రెండో బహుమతి 25,000.. మూడో బహుమతి 20,000లు అందజేయనున్నారు. ఈ పోటీలు ఎనిమిది రోజులు కొనసాగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
గద్వాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం - ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం
యువత చదువుతో పాటు... క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గద్వాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
గద్వాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం
రాష్ట్రం ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలని సూచించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:క్యాట్‌లో తెలుగు విద్యార్థుల మెరుపులు