గర్భిణీలకు వైద్యసేవల విషయంలో అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర సర్కారు హైకోర్టుకు నివేదించింది. గద్వాలకు చెందిన ఓ గర్భిణీ, పసికందు మృతికి బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. అలాగే హైవేలపై 86 అంబులెన్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
గర్భిణీ, పసికందు మృతిపై హైకోర్టులో ముగిసిన విచారణ - Gadwal pregnancy women and infant death investigation latest updates
గద్వాలకు చెందిన ఓ గర్భిణీ, పసికందు మృతి ఘటనపై న్యాయవాదులు కిశోర్ కుమార్, శ్రీనిత రాసిన లేఖలపై విచారణ ముగిసినట్లు హైకోర్టు ప్రకటించింది. బాధ్యులైన వైద్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలా వద్దా అనేది ప్రభుత్వానికి వదిలేస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది.
Telangana high court latest news
బాధ్యులైన వైద్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలా వద్దా అనేది ప్రభుత్వానికి వదిలేస్తున్నామని హైకోర్టు పేర్కొంది. న్యాయవాదులు కిశోర్ కుమార్, శ్రీనిత లేఖలపై విచారణ ముగిసినట్లు న్యాయస్థానం ప్రకటించింది.