తెలంగాణ

telangana

ETV Bharat / state

మహనీయుల స్పూర్తితో ముందుకుసాగాలి: కృష్ణమోహన్​ రెడ్డి - jyotirao poole birthday

ప్రతీ ఒక్కరూ మహనీయుల అడుగుజాడల్లో ముందుకు నడవాలని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

jyotirao poole birthday
జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

By

Published : Apr 11, 2021, 3:59 PM IST

మహనీయుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఆయన విగ్రహానికి జిల్లా నాయకులతో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

మహనీయుల సేవలను ఎప్పటికీ మరువకూడదని ఎమ్మెల్యే కృష్ణమోహన్​ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్​ ఛైర్​పర్సన్​ సరిత, మున్సిపల్ ఛైర్మన్​ కేశవ్​, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:చెల్లిని చంపి.. అన్న అండతో అడవిలో పూడ్చిన బాలుడు

ABOUT THE AUTHOR

...view details