తెలంగాణ

telangana

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

By

Published : Oct 9, 2020, 5:16 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మహిళలకు ఆయన చీరలను పంపిణీ చేశారు.

gadwal mla bathukamma sarees distribution in jogulamba gadwal district
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శారదా విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు.

ఈ ఏడాది 26 వేల చేనేత మగ్గాలపై 287 రకాల డిజైన్లతో బతుకమ్మ చీరలు తయారు చేయడానికి ప్రభుత్వం రూ.317 కోట్లు ఖర్చు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని వెల్లడించారు.

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details