విపత్కర పరిస్థితుల్లో నిరంతరం పని చేస్తున్న సిబ్బందిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోరారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు శానిటైజర్లు, మాస్కులను అందజేశారు. విక్రమసింహా రెడ్డి అందించిన రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా వైద్య, పోలీసు సిబ్బందికి అందజేశారు.
దాతలు ముందుకు రావాలి: గద్వాల ఎమ్మెల్యే - gadwal mla bandla krishnamohan reddy
మల్దకల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అత్యవసర విభాగాల్లో పనిచేసే వైద్య, పోలీసు సిబ్బందికి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.
దాతలు ముందుకు రావాలి: గద్వాల ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఈ రెండు చిట్కాలతో కరోనా నుంచి రక్షణ!'