జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మున్సిపాలిటీలో ఛైర్మన్ బీఎస్ కేశవ్ అధ్యక్షతన పురపాలక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్నికి ఎమ్మల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
'అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి' - Gadwal Municipality meetings
అభివృద్ధి పనులకు ప్రతిఒక్కరూ పార్టీలకతీతంగా సహకరించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
'అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి'
గద్వాల పట్టణ అభివృద్ధికి కూడా ప్రతి ఒక కౌన్సిలర్ పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.