Gadwal Eruvada Jodi Panchalu To Dallas :తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తులు పట్టువస్త్రాలు సమర్పిస్తే.. సాధారణంగా ఉత్సవ విగ్రహాలకే అలంకరిస్తుంటారు. కానీ గద్వాలలో తయారయ్యే ఏరువాడ జోడు పంచెలను మాత్రం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజున మూలవిరాట్టుకు అలంకరిస్తారు. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ జోడు పంచెలను.. అమెరికాలోని డల్లాస్ శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పంపుతూ.. గద్వాల చేనేత ప్రతిభను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.
Reconstruction Of Sircilla TTD Temple : నేతన్నల ఖిలాల్లో వెంకన్న కోవెల.. ప్రత్యేకతలు ఇవే..
Gadwal Eruvada Jodi Panchalu To Dallas Srinivas Temple :400 ఏళ్లుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో.. గద్వాల సంస్థానాధీశులు సమర్పిస్తున్న జోడు పంచెలనే .. మొదటిరోజున మూలవిరాట్టుకు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. జోడు పంచెల్లో ఒకదానిని మూలవిరాట్టుకు, మరో పంచెను కండువాలా అలంకరిస్తారు. శ్రావణమాసంలో స్వామివారి నామాలతో ఈ పంచెలను ప్రత్యేకంగా నేస్తారు. పట్టు అంచుతో తయారయ్యే ఈ పంచె.. సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల వెడల్పుతో ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా తయారుచేసిన మగ్గంపై.. ఒకేసారి ముగ్గురు నేతన్నలు ఈ పంచెలు తయారుచేస్తారు. మండల దీక్ష తీసుకుని ఒంటిపూటే భోంచేస్తూ.. రోజుకు 8 గంటలు శ్రమించి.. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు.
వైభవంగా పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు
'' తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజున మూలవిరాట్టుకు జోడు పంచెలను అలంకరించడం మా పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తుంది. నేను ఇక్కడ శ్రీవారి పట్టు వస్త్రాలను 18 సంవత్సరాల నుండి తయారు చేస్తున్నాను. ఏరువాడ జోడు పంచె ప్రత్యేకత ఏమిటంటే పొడవు 11 గజాలు వెడల్పు 82 గజాలు ఉంటుంది. దీన్ని బ్రహ్మోత్సవాల మొదటి రోజు స్వామి వారికి అలంకరించిన తర్వాతే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.''- గద్దె మురళి, బుచ్చయ్య చేనేత కార్మికులు