జోగులాంబ గద్వాల జిల్లాలోని కలెక్టరేట్ లో నాలుగు మున్సిపాలిటీలలో హరితహారం, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటుపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ శ్రుతి ఓఝా సమీక్షించారు. హరితహారంలో గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 4.60 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మొక్కలు ఎక్కడెక్కడ నాటాలో ప్రణాళికలు సిద్ధం చాశారా అని ప్రశ్నించారు.
రోడ్డు ఎవెన్యూ కింద ఔటర్ రింగ్ రోడ్డు, గద్వాల ప్రధాన రహదారులు, పట్టణంలోని ప్రధాన రహదారుల్లో కలిపి 21 వేల మొక్కలు నాటేందుకు వచ్చే శనివారం లోపు గుంతలు తవ్వించటం, వాటికి కావలసిన ట్రీ గార్డులు, మొక్కలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జులై 13 నుంచి ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రారంభించేందుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మియానాకి పార్కులు పట్టణంలో కనీసం 3 నుంచి 4 స్థలాల్లో భూమి చదును చేసి పెట్టాలని, ఆగస్టులో మియానాకి ప్లాంటేషన్ జరిగే విధంగా సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.