జోగులాంబ గద్వాల్ జిల్లా డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న సీఐ సైదానాయక్పై వేటు పడింది. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కల్మెట్ తండాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఐ పాల్గొన్నాడని ఆరోపణలొచ్చాయి. ఈ నెల 6 నుంచి 10 వరకు విధులకు హాజరు కాకుండా హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారంలో తిరిగాడని వచ్చిన ఆరోపణల దృష్ట్యా సస్పెండ్ చేస్తూ...నిజామాబాద్ రేంజ్ డీఐజి ఉత్తర్వులు జారీ చేశారు.
హుజూర్నగర్ ఎన్నికల ప్రచారంలో సీఐ... సస్పెన్షన్ - హుజూర్నగర్ ప్రచారంలో గద్వాల్ సీఐ... సస్పెన్షన్
హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సీఐ సైదానాయక్పై వేటు వేశారు.
gadwal-ci-saidhireddy-suspended-for-participeted-in-huzurnagar-by-elections-campaign