జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రసాద్ పథకం ద్వారా కేంద్ర సర్కార్ రూ.36.73 కోట్లు విడుదల చేసింది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, రాష్ట్ర నాయకుడు యాదగిరి రెడ్డి, స్థానిక కాషాయ నేతలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఆవరణలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
జోగులాంబ శక్తిపీఠం అభివృద్ధికి 36.73 కోట్లు విడుదల - Prasad scheme
ఐదో శక్తిపీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.36.73 కోట్లు విడుదల చేసింది. దీనికి కృతజ్ఞతగా భాజపా నాయకులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

జోగులాంబ శక్తిపీఠం అభివృద్ధికి 36.73 కోట్ల నిధులు విడుదల
స్థానిక ఎమ్మెల్యే అబ్రహం.. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారని.. కేసీఆర్ నిధులు ఇచ్చినట్లు నిరూపించగలరా అని భాజపా నేతలు సవాల్ విసిరారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసి జిల్లాలో ఈ శక్తిపీఠాన్ని మంచి పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
- ఇదీ చూడండి :తెరాస పకడ్బందీ వ్యూహం... గులాబీదే గ్రేటర్ పీఠం!