అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన ఓ మహిళా రైతు.. ఆగ్రహంతో ఊగిపోయింది. గ్రామ సచివాలయానికి తాళం వేసి.. ఆఫీసు ఎదుటే ఆందోళన చేపట్టింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో చోటుచేసుకుంది.
బైరాపురం గ్రామానికి చెందిన సువర్ణ పొలం పక్కనే.. గ్రామ సచివాలయానికి చెందిన డంపింగ్ యార్డ్ ఉంది. అందులో వేస్తోన్న చెత్త చెదారం మొత్తం.. పొలం లోనికి వస్తుండటంతో ఆ విషయాన్ని ఆమె పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.