తెలంగాణ

telangana

ETV Bharat / state

అమృత్ మహోత్సవాలు.. ఘనంగా 'ఫ్రీడం రన్‌' - జోగులంబా గద్వాల జిల్లా

ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 'ఫ్రీడం రన్‌' కార్యక్రమం జరుగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో.. కలెక్టర్ శ్రుతి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

freedom run in the part of azadi ka amruth mahosthav in gadwala city jogulamba district
అమృత్ మహోత్సవాలు.. ఘనంగా 'ఫ్రీడం రన్‌'

By

Published : Mar 24, 2021, 9:53 AM IST

ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. జోగులంబా గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో 'ఫ్రీడం రన్‌' ఘనంగా జరిగింది. కలెక్టర్ శ్రుతి ఓజా, ఎస్పీ రంజన్ కుమార్​తో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి.. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు.

కలెక్టర్ శ్రుతి ఓజా.. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఆగస్టు వరకు జరిగే ఉత్సవాల్లో.. విద్యార్థులు, క్రీడాకారులంతా పాల్గొనాలని కోరారు.

ఇదీ చదవండి:ఆ స్టూడెంట్స్​ సగటు వేతనం రూ.28.29 లక్షలు

ABOUT THE AUTHOR

...view details