తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు: కలెక్టర్ - Former Prime Minister of India PV Narasimha Rao Birth day celebrations

బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా గద్వాల జిల్లా కలెక్టర్​ శ్రుతి ఓజా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా దేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు అద్భుతమని కొనియాడారు.

Former Prime Minister of India PV Narasimha Rao 100 years Birth day celebrations in Jogulamba gadwal district
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహరావు

By

Published : Jun 28, 2020, 4:19 PM IST

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ సరిత... ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి,​ అబ్రహాంలు పాల్గొన్నారు. కలెక్టర్​ శ్రుతి ఓజా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.

ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారతదేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని ఆమె తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా దేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఒక తెలుగువాడిగా రాష్ట్రానికి అలాగే దేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details